ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే


Ens Balu
3
Rajamahendravaram
2022-07-15 12:44:06

ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన ప్రాంతాలు, కాటన్ బ్యారేజీ ప్రాంతం వరద నీటితో మొత్తం జలమయం అయ్యాయి. ఎగువ గోదావరి నుంచి వరద నీరు దవళేశ్వరం కాటన్ బ్యారేకి రావడంతో మూడవ ప్రమాద హెచ్చరిక కూడా చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం నుండి ఏరియల్ సర్వే ద్వారా ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాలను క్షణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కలెక్టర్లు, జెసి, ప్రభుత్వానికి వరదలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. అటు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి జరిపిన ఏరియల్ సర్వేలో వెంట రాష్ట్ర హోం మంత్రి  తానేటి వనిత తదితరులు ఉన్నారు.