వరద బాధితులకు సౌకర్యాలు కల్పించండి


Ens Balu
7
Bhimavaram
2022-07-15 12:59:06

రాష్ట్రంలో వర్షాలు , వరదలు  ప్రభావం ఉన్న ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా  చేయవలసిన  ఏర్పాట్లు పై  జిల్లా కలెక్టర్లకు  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తగు అదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్య మంత్రి  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం నుంచి  శుక్ర వారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వీడియో కన్ఫరెన్స్ లో యలమంచిలి తహశీల్దారు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి, యస్ పి  యు. రవి ప్రకాష్  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి మాట్లాడుతూ వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. ఎలమంచిలి , ఆచంట,  నరసాపురం మండలాల్లోని 30 గ్రామాలకు వరద ప్రభావం ఉందని ,  ఇప్పటికే 28 రిలీప్ క్యాంపులు ప్రారంభించి నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  సెక్రటేరియట్ స్టాప్ , పంచాయతీ సిబ్బంది అందరూ గ్రామాలలో 24 గంటలు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటర్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు .  గర్భిణీలు  ,  బాలింతలు  , చిన్నపిల్లలను  ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని ఆమె అన్నారు. అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని మందులు అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  పశువులకు పది రోజులకు సరిపడా మేతను  పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.  ఎక్కడైనా ఏటిగట్లకు లీకేజీలు ఏర్పడితే వాటిని వచ్చేందుకు  28 మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందని కలెక్టర్ వివరించారు.  ఆచంట మండలం కోడేరు రేపు నుండి జిల్లా జాయింటు కలెక్టర్ జె వి మురళి  , ఆచంట శాసనసభ్యులు  చెరుకువాడ. శ్రీరంగనాథరాజు ,  భీమవరం కలెక్టర్ కార్యాలయం నుండి, డిఆర్ఓ  కె. కృష్ణవేణి ,  వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు .