ఆ 8మండలాలు అప్రమత్తంగా ఉండాలి


Ens Balu
5
Rajamahendravaram
2022-07-15 15:01:50

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 8 మండలాలు వరద ముంపు ప్రభావానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వరద పరిస్థితి పై జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవీలత జిల్లాలో వరదల సమయంలో తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు.  తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత తూర్పు గోదావరిలో నాలుగు మండలాలు, పశ్చిమ గోదావరిలో ఉన్న నాలుగు మండలాలు వరద ప్రభావానికి గురి అయ్యే అవకాశం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలోని పలు లంక గ్రామాలపై వరద నీరు వలన ముంపుకు గురవుతాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే నేను, హోం మంత్రి , జిల్లా ఎస్పీ ముంపుకు గురి అయ్యే లంక గ్రామాల్లో పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని కోరడం జరిగిందన్నారు. జిల్లాలో ఆరు లంక గ్రామాలు ఉన్నాయని, వాటికి రహదారి మార్గం తో అనుసంధానం ఉందన్నారు. ముంపు గ్రామాలను మిగిలిన వారు కూడా తరలి రావలని స్పష్టం చేశామన్నారు. . ఆ గ్రామ ప్రజలు 1986 వరదల సమయంలో కూడా తమ గ్రామాల్లోకి వరద నీరు చేరలేదని తమకు చెప్పడం జరిగిందని ముఖ్యమంత్రికి తెలిపారు. అయినప్పటికీ ఈసారి వరద వుదృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశామన్నారు. మరోసారి ఈరోజు ఎస్పితో కలిసి ఆ లంక గ్రామానికి వెళ్ళడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ముంపుకు గురవుతాయి అనే గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షితం గా తరలించినట్లు కలెక్టర్ తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు పునరావాస కేంద్రాల్లో రేషన్ ఉల్లిపాయలు ఆలుగడ్డలు ఆయిల్ వాటి నిత్య సరుకులు ఉంచామని తెలిపారు. మెడికల్ క్యాంపు లుకుడా  ఏర్పాటు చేసి నట్లు వివరించారు. రెవెన్యూ సచివాల సిబ్బంది ని ముంపు గ్రామాల వద్ద నుంచి ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 123 కిలోమీటర్లు గోదావరి బండ్ అనుకుని రహదాలు ఉన్నాయని వీటిని పర్యవేక్షించేందుకు 47 మొబైల్ పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసు రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ అండ్ బి అధికారులతో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ చేయాల్సిన పనులు పై సమీక్షించి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాండ్ బ్యాగులను తరలించి ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధం చేశామన్నారు.  జిల్లాలో 32 ఘాట్లు ఉన్నాయని, అక్కడ  మెట్ల పై వరకు నీళ్లు వచ్చినందున వాటిని తాత్కాలికంగా బారిగెట్లు  ఏర్పాటు చేసి ప్రజలు వెళ్లకుండా నియంత్రించడం జరుగుతుందన్నారు.