బాధితుల సహాయం కోసం రూ.2కోట్లు
Ens Balu
2
Rajamahendravaram
2022-07-15 15:55:10
వరద బాదితుల సౌకర్యార్థం ముంపు ప్రాంతాల్లోని 4 జిల్లా ల్లో జిల్లా కి 2 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి విడు దల చేశారని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత అన్నారు. శుక్రవారం మద్దూరు లంక గ్రామం లో 393 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి వనిత మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు నిత్యాసం సరుకులు పంపిణీ చేసి ముఖ్యమంత్రి అన్ని విధాల ఆదుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రజా ప్రతినిధులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు కల్పిస్తున్నామని ఈసారి వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. సుమారు 23 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఆకాశం ఉందని గతంలో మా ప్రాంతాలు మురగలేదని అనుకోవద్దని ఏదైనా ప్రమాదం జరిగితే చింటించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ముంపు గ్రామాల ప్రజలు కుటుంబాలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కుటుంబానికి 2000 వ్యక్తిగత ఉన్నవారికి ₹1000 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఆపదలో అది కోవడానికి ప్రజలు సహకరించి అధికారులు చేసే సూచనలను పాటించాలని మంత్రి కోరారు. మద్దూరు లంక గ్రామంలో ప్రతి ఇంటికి మంత్రి, ఇతర ప్రజా ప్రతినిదులతో వెళ్ళడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపి మార్గని భరత్ రామ్, మాట్లాడుతూ 4 జిల్లా ల కలెక్టర్ లతో ముఖ్య మంత్రి సమీక్ష నిర్వహించారన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. బలహీనంగా ఉన్న గోదావరి గట్ల పటిష్టత కు 40 వేల ఇసుక మూటలను సిద్ధం చేసామన్నారు. ఈ కార్యక్రమం లో ఎం ఎల్ ఏలు జక్కంపూ డి రాజా, జి. శ్రీనివాస నాయు డు, యం. పి. పి. కాకర్ల సత్య నారాయణ, మండల తాహి సీల్దార్, బి. నాగరాజు నాయక్ ప్రత్యేక అధికారి, గితాంజలి తదితరులు ఉన్నారు.