తూర్పుగోదావరి జిల్లాలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు రాజమండ్రి లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రత్యేక అధికారి హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తో కలిసి స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కంట్రోల్ పరిధిలో వచ్చే ప్రతి ఒక్క ఫోన్ కాల్ ను రిజిస్ట్రేషన్ చేయ్యాలన్నరు. ప్రజల నుంచి ఏ విధమైన ఫిర్యాదులు అందుతున్నాయో తెలుసుకున్నారు. కంట్రోల్ రూం నంబర్ విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అత్యవసర సేవలు, సహాయం కోసం వచ్చే ఫోన్ కాల్ కు స్పందించి సంబందించిన అధికారులకు సమాచారం తెలిపి సమస్య పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తూన్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా , డివిజన్ స్థాయి లో కంట్రోల్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్ 8977935609, డివిజన్ పరిధిలో రాజమహేంద్రవరం 0883 2442344, కొవ్వూరు 088132 31488 లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ కె .మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్వో బి. సుబ్బారావు, తదితరులు ఉన్నారు.