ఫ్రై డే డ్రై డే గా తప్పకుండా పాటించాలి


Ens Balu
6
Vizianagaram
2022-07-16 12:21:45

వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖల సమన్వయంతో  పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి సూచించారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని అన్నారు. పారిశుధ్యం,  వ్యాధుల నివారణ పై మున్సిపల్ కమీషనర్లు, వైద్య శాఖ అధికారులతో   శనివారం కలెక్టర్ సమీక్షించారు.  ఎక్కడ చెత్త కుప్పలు కనపడిన, నీటి నిల్వలు  గుర్తించినా, డ్రైనేజీ లు ఓవర్ ఫ్లో అయినా వాటిని  సంబంధిత యాప్ లో. హెల్త్ సెక్రటరీ, సానిటరీ సిబ్బంది తో కలసి అప్లోడ్ చేయాలని , సంబంధిత శాఖలు  వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి క్లియర్ చేయాలన్నారు. ఫ్రై డే డ్రై డే గా తప్పక పాటించాలని ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ సహాయకులు, వాలంటీర్లు ,సానిటరీ సెక్రటరీలు, డ్వాక్రా మహిళలు భాగస్వామ్యం కావాలని సూచించారు. జిల్లాలో డెంగీ కేసు లు నమోదు అయితే సహించేది లేదని, అందరూ సమన్వయం  తో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి, డి.పి.ఓ సుభాషిణి, జిల్లా  పరిషత్ సి.ఈ.ఓ అశోక్ కుమార్, జిల్లా మలేరియా అధికారి తులసి తదితరులు పాల్గొన్నారు.