అనంతలో సజావుగా సచివాలయ పరీక్షలు..
Ens Balu
6
Anantapur
2020-09-20 11:48:22
అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష సందర్భంగా ఆదివారం ఉదయం ప్రధాన కేంద్రం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కాలే జి) లోని కామర్స్ బ్లాక్ లో పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థుల గదిలోకి వెళ్లి పర్యవేక్షించారు. అలాగే పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు . అనంతరం అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. కామర్స్ బ్లాక్ లో 112 మంది అభ్యర్థులకు గాను 28 మంది గైర్హాజరు అయినట్లు కలెక్టర్ గుర్తించారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్ధులకు మంచినీరు, మందులు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పారామెడికల్ సిబ్బంది, కరోనా పాజిటివ్ వ్యక్తులను, లక్షణాలు వచ్చిన వ్యక్తులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.