కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక
Ens Balu
2
Dhavaleswaram
2022-07-16 13:11:16
తూర్పుగోదారి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి వరద ప్రవాహం కొనసాగు తుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 25.29 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎంత నీరు వస్తే అంతే నీటికి అధికారులు సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరద ప్రవాహం నెమ్మదిగా మాత్రమే పెరుగుతుందని..ఈ రాత్రి వరద ప్రవాహాం తగ్గే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచే రాష్ట్ర విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఎండి బి. ఆర్ అంబేద్కర్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రవాహం, ముంపు ప్రాంతాల వారి సమాచారం అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా..అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు, వారికి కావాల్సిన సదుపాయాలను సైతం జిల్లా యంత్రాంగం ఏర్పాట్టు చేస్తున్నది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక బులిటెన్ ద్వారా కోరింది.