ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని, మరో 2, 3 నెలల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, ఐ.టి శాఖామంత్రి గుడివాడ అమరనాథ్ స్పష్టం చేసారు. విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ శనివారం స్థానిక స్థానిక ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమర్నా థ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విశాఖపట్టణానికి ప్రత్యేక స్థానం ఉందని దేశ, విదేశాల నుంచి వచ్చినవారు ఈ ప్రాంతాన్ని ముందుగా చూడాలని అనుకుంటారని అన్నారు. ఈ శనివారం పశ్చిమ ఆస్ట్రేలియా బృందం కూడా మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినపుడు వాళ్ళు బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైని మాత్రమే ఎంచుకున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. తను అధికారికంగా ఏప్రాంతానికి వెళ్ళినా, వీలైనంత త్వరగా విశాఖ వచ్చేయాలని అనుకుంటానని, ఇంతటి సుందరమైన ప్రదేశాన్ని రాజధానిగా చేస్తే ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అమర్నాధ్ చెప్పారు.
యజమానులు రుణాలు తిరిగి చెల్లించడంలో ఒక్క. రోజు ఆలస్యమైనా బ్యాంకులు ఇబ్బందులకు. గురిచే స్తూన్నాయని ఈ విషయాన్ని ప్రభుత్వంలో మాట్లాడి వారికి కొంత వెసులు బాటు కల్పించాలని బాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సతీష్ కోరారు. దీనిపై మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు,సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవలసిన అధికారులు. అందుకు భిన్నంగా వ్యవరించడం వలన ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని అమర్ నాధ్ హామీ ఇచ్చారు. అధికారాన్ని తాను చాలా దగ్గరగా చూస్తున్నానని, అయితే అది శాశ్వతం కాదన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచు కుoటానని అమర్ నాథ్ చెప్పారు. తను అధికారంలో ఉన్నoతవరకూ వీలైనంత మందికి సహాయం అందించాలని కోరుకుంటూ వుoటానని అమరనాథ్ స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా విశాఖలో త్వరలోనే ఎం.ఎస్. ఎంఈ. పార్క్ ను ఏర్పాటు చేస్తామన మంత్రి అమరనాధ్ తెలియచేసారు. ప్రభుత్వ స్థలం అందుబటులోకి రాగానే పార్క్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో 1.25 లక్షల ఎం ఎస్ ఎంఈలు 15వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నామని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయ ని ఆయన చెప్పారు. కాగా విశాఖ లో ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో .సి.ఇ.ఇ. సదస్సు నిర్వహించి మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు వస్తామని అమరనాద్ ఆ తెలియ చేశారు.