సమస్యల పరిష్కారంలో చొరవ చూపండి


Ens Balu
6
Bhimavaram
2022-07-18 10:37:37

పశ్చిగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన  స్పందన  కార్యక్రమంలో  జిల్లా రెవెన్యూ  అధికారి కె.కృష్ణవేణి కలెక్టరేట్ ఏవో వై రవికుమార్, డిఎస్పి కె.ప్రభాకర్, స్పందన తాసిల్దార్ దుర్గా కిషోర్, అనంత కుమారి, భీమవరం ఎంపీడీవో జి పద్మ లతో హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సంధర్బంగా జిల్లాలోని వివిధ గ్రామాల నుండి  వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారుల అందించిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారంకు సంబందించి  సంబంధిత అధికారులకు డిఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా డిఆర్ఓ  మాట్లాడుతూ స్పందన ద్వారా అందిన దరఖాస్తులను ఎట్టిపరిస్థితులలోనూ నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. స్పందనలో అందిన వినతుల పరిష్కారం లో ఎటువంటి జాప్యానికి తావులేకుండా పరిష్కరించాలన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్పందన కార్యక్రమం ఉండాలన్నారు.  ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు  క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా, అర్జీదారుడు సంతృప్తిచెందేలా  నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.  స్పందన అర్జీలను  మరింత సులభతరంగా, నాణ్యతతో పరిష్కరించడంతో పాటు పరిష్కార నివేదికను కూడా సంబందిత పోర్టల్లో పొందుపరచాలన్నారు. అనర్హత కలిగిన దరఖాస్తులను అందుకు తగిన కారణాలను తప్పనిసరిగా వివరిస్తూ తిప్పి పంపాలన్నారు. స్పందన కార్యక్రమంలో  వృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యులు మేళం దుర్గా ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.