పశ్చిమగోదావరి జిల్లాలో వరద తాకిడి ప్రాంతాల ప్రజలకు ఏవిధమైన ఇబ్బంది కలగని పటిష్ట మైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఆయా జిల్లాలలోని వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్ లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి వరద ఉపశమన పునరావాస ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ , జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి , ఎస్పీ యు. రవిప్రకాష్ , జాయింట్ కలెక్టర్ జెవి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పునరావాస కేంద్రాలలో 7334 మంది ఉన్నారని , పునరావాస కేంద్రంలో ఉన్నవారికి ,పునరావాస కేంద్రానికి రావడానికి నిరాకరించిన వారికి కూడా ఉదయం అల్పాహారం , మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో నూ ప్రజలకు 25 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు , ఒక కేజీ ఆయిల్ , ఒక లీటర్ పాలు , బిస్కెట్లు , బ్రెడ్లు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు .
పశువుల కొరకు 2 టన్నుల పశుగ్రాసం కూడా పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు .జిల్లాలో వరద ప్రభావ ప్రాంతాలలోని ప్రజలను తరలించేందుకు 104 బోట్లను, 208 మంది గజఈతగాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు. గ్రామాలలో గ్రామస్థాయి సిబ్బందిని, తాసిల్దారులు , ఎంపీడీవోలను నియమించి 24 గంటలు వరద పరిస్థితిపై మానిటర్ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. వరద ప్రభావ గ్రామాలలోని ప్రజలకు రెండు వేల రూపాయలు వారి అకౌంట్ కు బదిలీ చేసేందుకు ఎన్యూమురేషన్ చేయడం జరుగుతుందని వాటిని ఈరోజు నుండి వారి అకౌంట్ కు 2000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. వరద పనరావాస కార్యక్రమాలకు అదనంగా మరో రెండు కోట్ల రూపాయలు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమె కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.