మన్యం జిల్లాలో స్పందన అర్జీలు..120


Ens Balu
6
Parvathipuram
2022-07-18 11:17:22

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వినతులు పెద్ద ఎత్తున అందాయి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, సబ్ కలెక్టర్ భావన ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి 120 అర్జీలు అందాయి. జియ్యమ్మవలసకు చెందిన జి.సుజాత వికలాంగుల పింఛను మంజూరు చేయాలని కోరారు. పార్వతీపురానికి చెందిన మామిడి శారద అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. పెద గొడబ గ్రామానికి చెందిన పి.కృష్ణ పింఛను ఇపించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. పులిపుట్టి గ్రామానికి చెందిన ఎల్.గణేష్ అనే వ్యక్తి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతి రాజ్ ఇఇలు ఓ. ప్రభాకర రావు, ఎం.వి.జి. క్రిష్ణాజి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా అధికారి మంజుల వాణి, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి గొల్ల వరహాలు, సెరికల్చర్ అధికారి సాల్మన్ రాజు, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఔషద నియంత్రణ అధికారి ఏ.లావణ్య, జిల్లా రవాణా అధికారి ఎం.వి.గంగాధర్, జిల్లా ప్రధాన అగ్ని మాపక అధికారి కె. శ్రీను బాబు, తదితరులు పాల్గొన్నారు.