గ్రామ సచివాలయ వ్యవస్థలో విశేష సేవలు..


Ens Balu
2
Tirupati
2020-09-20 12:28:21

సచివాలయ వ్యవస్థతో  దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 4 లక్షల 20 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత  సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతిలో జరుగుతున్న సచివాలయ ఉద్యోగ  పరీక్ష కేంద్రం ఎస్.వి. కాంపస్ హైస్కూల్ లో నగరపాలక కమిషనర్ గిరిషా తో కలసి నిర్వహణను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ,  ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేరువవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఆలోచనతో సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు. గతంలో 20 లక్షల మంది 4లక్షల 20 వేల ఉద్యోగాలకు సచివాలయ పరీక్షలు వ్రాసారని అసమయంలో ఏర్పాటు చేసిన అన్నీ కేంద్రాలు నేడు 16,028 ఉద్యోగాలకు చేపట్టామని అందుకు కారణం కోవిడ్ అని బౌతిక దూరంతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు కూడా పరీక్షలు వ్రాయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టి పరీక్షా కేంద్రాలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. నేడు జరిగే సచివాలయ సెక్రటరీల పరీక్షలకు 6,09,026 మంది అభ్యర్థులు ఉదయం 4,06,936 మంది 2221 పరీక్షా కేంద్రాల్లో , మద్యాహ్నం 2,02,090 మంది 1059 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని ఆన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో 10 నుండి 14 మంది సచివాలయ ఉద్యోగులు ,  ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్లు,  పట్టణాల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు వున్నారని చెప్పారు. సచివాలయ, రైతు భరోసా , అంగన్ వాడి కేంద్రాల  పక్కాభవనాల నిర్మాణం చేపడుతున్నామని మార్చిలోపు అవి పూర్తి కానున్నాయని అన్నారు. గతంలో అంగన్  వాడీలు నిర్మించి బిల్లులు చెల్లించని వాటికి కూడా బకాయిలు చెల్లిస్తున్నామన్నారు.  పరీక్షల నిర్వహణ పగడ్భందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి పర్యటనలో తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి,  నగరపాలక అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.