పార్వతీపురం మన్యం జిల్లాలోని జగనన్న కాలనీల్లో రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మునిసిపల్, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సోమ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముమ్మరంగా నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీల్లో రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాలనీల్లో రహదారుల నిర్మాణం ప్రగతిలోకి రావాలని ఆయన స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణానికి ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సొంత స్థలాల్లో నిర్మాణాల పైనా దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు గృహ నిర్మాణాలకు రూ.35 వేల రుణం మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అమృత్ సరోవర్ కార్యక్రమం క్రింద చేపట్టిన పనులను ఆగస్టు 14 నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అమృత్ సరోవర్ చుట్టు ప్రక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆగష్టు 15వ తేదీ నాటికి అమృత్ సరోవర్ ను ప్రారంభించాలని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులను పంచాయితీ వారీగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. వర్షాలు కురిసినా పనులకు ఆటంకం ఉండని పనులు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. అమృత్ సరోవర్ కార్యక్రమానికి లక్ష్యాలకు చేరువలో వేతనదారులు ఉండాలి ఆయన పేర్కొన్నారు.
అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. కనీసం 10 వేల క్యూబిక్ మీటర్ల నీరు నిలువ ఉండాలని, చెరువు చుట్టూ తుప్పలను తొలగించాలని, నాలుగు వైపులా చెరువు గట్టును నాలుగు మీటర్ల ఎత్తున దశల వారీగా చదునుగా వేయాలని ఆయన చెప్పారు. చెరువుకు బోర్డును ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. చెరువు గట్టుపై నాలుగు వైపులా వ్యాహ్యాలికి అనుగుణంగా తయారు చేయాలని, చుట్టూ మొక్కలు నాటాలని, దగ్గరలో జాతీయ జెండా ఎగుర వేయుటకు అనువుగా నిర్మాణం చేయాలని, దాతల సహకారంతో బెంచీలు ఏర్పాటు చేయాలని, చెరువు వినియోగదారుల సంఘం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఎగుర వేయాలని ఆయన ఆదేశించారు. మ్యుటేషన్ నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశిత సమయంలో బలిజిపపేట, జియ్యమ్మ వలస తదితర మండలాల్లో పూర్తి కావడం లేదని, రెవిన్యూ డివిజనల్ అధికారులు బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.
మునిసిపల్ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగు పడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు ఏంటి లార్వా ఆపరేషన్ తక్షణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. సచివాలయం శానిటేషన్ సెక్రటరీ ప్రత్యేక బాధ్యత వహించాలని ఆయన ఆదేశించారు. రానున్న మూడు నెలలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. వరదలపై ప్రతి రోజూ మండల, డివిజన్ కేంద్రాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. సోమ, శుక్ర వారాల్లో 18 సంవత్సరాలు దాటిన వారికి సచివాలయాలలో కోవిడ్ మెగా వాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ రీ సర్వే వేగవంతం చేయాలని అదేశించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భావన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి ఎం.వి.జి. క్రిష్ణాజి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాస రావు, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రామ చంద్ర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ప్రణాళిక అధికారి వీర్రాజు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్ తదితరులు పాల్గొన్నారు.