ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా వరద తాకిడి ప్రాంతాలలో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ వరద చర్యలు కొనసాగింపుపై ఒక ప్రకటనలో వివరిస్తూ వరదలు, అధిక వర్షాలు కారణంగా జిల్లాలోని మూడు మండలాల్లో 31 గ్రామాలు వరద తాకిడికి గురికాగా ఆయా ప్రాంతాల్లో 23,130 మంది నివాసం ఉంటున్నారని తెలిపారు. 13,468 మంది కలిగిన 2,358 కుటుంబాలను కాళీ చేయించడం జరిగిందన్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 16 టీం లను, 49 మంది ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ 135 మంది, ఫైర్ సర్వీస్ 29 సిబ్బందిని రంగంలోనికి దించడం జరిగిందన్నారు. అలాగే 123 బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 32 పునరావాస కేంద్రాలను ఏర్పాటు 11,589 మందికి ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రభుత్వపరంగా అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వరద ప్రాంతాల్లో 31 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడంతోపాటు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. 1,48,132 ఆహార పొట్లలను, 10,59,000 వాటర్ ప్యాకెట్లను, 31.25 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 24 మెట్రిక్ టన్నుల కందిపప్పును, 7 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలను, 37.26 మెట్టుకు టన్నుల పంచదారను, 10,527 లీటర్ల పామాయిల్ ను, 7 మెట్టుకు టన్నుల ఉల్లిపాయలను, 6,693 లీటర్ల పాలను ఇప్పటివరకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
బట్టలు, వంట పాత్రలు అందించేందుకు రు.64.6 లక్షలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక లీటర్ పాలు, పిల్లలు కలిగి ఉన్న కుటుంబానికి రెండు లీటర్ల చొప్పున పాలు అందజేయడం జరుగుతున్నది అన్నారు. పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారుల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయనికి సంబంధించి ఎనిమిది మండలాల్లో 209 హెక్టార్లలో, ఉద్యానవన పంటలకు సంబంధించి 253.60 హెక్టార్లలో వరద తాకిడి ప్రభావం ఉందన్నారు. 599 ఉద్యానవన రైతులకు సుమారు రూ.7.15 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. 24 గంటలకు పైబడి 7,497 ఇల్లు వరద నీటిలో ఉన్నాయన్నారు. 3 గుడిసెలు పాక్షింగా దెబ్బతిన్నాయన్నారు. 5 కచ్చా ఇల్లు పూర్తిగా దెబ్బతినడం వలన ఒక లక్ష 15 వేల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. ఒక వ్యక్తి కనిపించకుండా పోయారని, అలాగే ఒక మైనర్ బాలుడు పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. జిల్లాలో 97 రోడ్లు దెబ్బతినగా 4 437.47 కిలోమీటర్ల మేర రోడ్లు ఉపరితలం దెబ్బతిన్నాయని తెలిపారు. సుమారు 34,528 లక్షల విలువైన రోడ్లు పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ కి సంబంధించిన 1,129 లక్షల విలువైన 26 రోడ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. 882 వలలు, 171 బోట్లు దెబ్బతిన్నాయన్నరు. అలాగే నీటిపారుదల వనరులు కూడా దెబ్బతిన్న వాటిలో ఉన్నాయన్నారు.