రెడ్‌క్రాస్‌, నాగజ్యోతి సాసైటీల దాత్రుత్వం


Ens Balu
5
Srikakulam
2022-07-19 08:01:05

శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన మసీదు ఇమామ్‌ జలాలుద్దీన్‌ పది నెలల కుమార్తె సిద్రాఫిర్లోజీకి లివర్‌ ప్లాంటేషన్‌కు రూ.28 లక్షలు అవసరమని చెన్నై రేలా ఆనుపత్రి యాజమాన్యం పేర్కొంది. దీనితో శివశ్రీ నృత్య కళానికేతన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘుపాత్రుని శ్రీకాంత్‌, శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పైడి రజని, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్‌ ట్రన్ఫు చైర్మన్‌ కొంక్యాన మురళీధర్‌, ముస్లిం మైనార్టీ నాయకులు బహుదూర్‌ భాషా, వాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధులు, జలాలుద్దీన్‌ కుమార్తె ఆవరేషన్‌కు దేశంలోను, ఇతర దేశాల్లో ఉన్న మిత్రులు, స్నేహితులు ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి అందించారు. కిట్టో యాప్‌ ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా మరికొంత విరాళాన్ని సేకరించారు.  దీనితో చిన్నారి ఆపరేషన్‌ విజయవంతమై ఇప్పుడు ఆమె ఆరోగ్యంగానే ఉంది. అయితే ఆపరీషన్‌ జరిగిన నాటి నుంచి పెద్ద అయ్యేంతవరకు చిన్నారికి వైద్య ఖర్చులు, తనిఖీ నిమిత్తం నెలకు రూ.10 వేలు అవనరం అవుతుంది. ఓ మసీదులో కేవలం రూ.10 వేలు గౌరవవేతనానికి పనిచేసే జలాలుద్దీన్‌ రూ.10 వేలు ఖర్చు పెట్టి మందులు కొనుగోలు చేయడం సాధ్యం కాని వ్యవహారం.

 ఈ విషయాన్ని గుర్తించి ప్రధానమంత్రి 15 నూత్రాల కమిటీ నభ్యుడు బవాదూర్‌ భాషా, రెడ్‌క్రాస్‌ లైఫ్‌ మెంబర్‌ కొంక్యాన వేణుగోపాల్‌,  జలాలుద్దీన్‌ కుటుంబాన్ని ఆదుకొనేందుకు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రావు, సీవీ నాగజ్యోతి వెల్ఫేర్‌ సొసైటీ చైర్మన్‌ మూర్తిలను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై రెడ్‌క్రాస్‌, నాగజ్యోతి ఫౌండేషన్‌ ప్రతినిధులు స్పందించి చెరో ట్రన్టు నుంచి రూ.4 వేలు చొప్పున రూ.8వేలు ఏడాది పాటు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధి డాక్టర్‌ నిక్కు అప్పన్న నెలకు వెయ్యి చొప్పున జలాలుద్దీన్‌కు అందజేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు శాంతా కళ్యాణ్‌ అనురాగ నిలయంలో జలాలుద్దీన్‌కు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రావు, నాగజ్యోతి ఫౌండేషన్‌, రెడ్‌క్రాస్‌ సీనియర్‌ ఆడిటర్‌ కనుగుల దుర్గా శ్రీనివాస్‌, డాక్టర్‌ నిక్కు అప్పన్న అందజేశారు. తమ అభ్యర్థనపై వెనువెంటనే స్పందించి జలాలుద్దీన్‌ కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల కొంక్యాన వేణుగోపాల్‌, బహుదూర్‌భాషా, రెడ్‌క్రాస్‌, నాగజ్యోతి వెల్ఫేర్‌ సాపైటీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఏడాది పాటు చిన్నారికి వా నంస్థల ద్వారా సవాయమందుతుందని, భవిష్యత్తులో ఇతర సంస్థల ద్వారా అయినా సహాయమందించేందుకు కృషి చేస్తామని వేణుగోపాల్‌, భాషా పేర్కొన్నారు.