పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం ఎన్.సి.ఎస్ సుగర్ రైతులకు రూ.3.87 కోట్ల బకాయి సొమ్ము విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతానగరం చెరకు రైతులకు రూ.16.85 కోట్లు మొత్తం బకాయి ఉండగా మే 20వ తేదీన రూ.9.10 కోట్లు విడుదల చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎన్.సి.ఎస్ సుగర్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసిన ధాత్రి రియల్ ఎస్టేట్ మరో రూ.2 కోట్లు డిపాజిట్ చేశారని దీంతో నిల్వ ఉన్న నగదును కలిపి ఇంకా బకాయి ఉన్న రూ. 7.75 కోట్ల మొత్తానికి గాను 50 శాతం బకాయిలను అందుబాటులో ఉన్న మొత్తం నుండి రూ.3.87 కోట్లు విడుదల చేయడం జరిగిందని, రెండు, మూడు రోజుల్లో 1,111 మంది రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఆయన వివరించారు.