బాలింతలకు అంగన్వాడీలోనే వండి పెట్టాలి


Ens Balu
10
Vizianagaram
2022-07-19 11:34:31

గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రంలో లే వండి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా  ఏ ఏ కేంద్రం పరిధిలో ఎంత మంది నమోదయ్యారు, ఎంత మంది కేంద్రానికి వస్తున్నారు అనే విషయాన్ని సీడీపీఓ వారీగా టీమ్స్ కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం కలెక్టర్ సమీక్షించారు.  ఎన్.ఆర్.సి లో శిక్షణ పొందిన సూపర్వైసర్లు గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం పై అవగాహన కలిగించాలన్నారు.  6 నెలల కె శిశువులకు సెమి సాలిడ్ ఆహారాన్ని అందించాలని, 10 నెలల వరకూ అందించకపోవడం వలనే పోషణ సరిపడక సామ్, మామ్ పిల్లల సంఖ్య పెరుగుతోందని అన్నారు.  అన్నం జావ గా చేసి పెట్టాలని, పళ్ళు, రాగి జావ తదితర పదార్ధాలను 6 నెలల నుండే పెట్టాలని అన్నారు. 
ప్రతి సీడీపీఓ వారం లో కనీసం 10 అంగన్వాడీ కేంద్రాలనైన తనిఖీ చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులను కూడా కలవాలని, వారితో కూడా గృహాల సందర్శన లో అవగాహన కల్పిస్తే చెప్పిన అంశాలను త్వరగా పాటిస్తారని తెలిపారు. కేంద్రాల్లో పోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించాలని, నాన్ పోర్టిఫైడ్ తీసుకోవద్దని సూచించారు. రెండు ప్రసవాలు తర్వాత తప్పకుండా కుటుంబ నియంత్రణ చేసుకునేలా అవగహన కలిగించాలన్నారు. 3వ బిడ్డ పుడితే బిడ్డకు, తల్లికి సమస్యలు వస్తాయని తెలపాలన్నారు. అదే విధంగా సీసారిన్లను తగ్గించాలని, అత్యవసరం అయితే తప్ప సీసారిన్ కు వెళ్లకూడదని ఈ విషయాలన్నీ అవగాహన కలిగించాలన్నారు. ముఖ్యనంగా ఆశ, అంగన్వాడీ, ఏ.ఎన్.ఎం ల మధ్య సమన్వయం  ఉండాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో పిడి శాంత కుమారి, సిడిపిఓ లు పాల్గొన్నారు.