ఎన్.జి.ఓల సహకారంతో హెచ్.ఐ.వి తగ్గుముఖం


Ens Balu
9
పార్వతీపురం
2022-07-19 11:49:31

పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ స్వచ్చంద సంస్థల సహకారంతో హెచ్.ఐ.వి తీవ్రత తగ్గుముఖం పట్టిందని పార్వతీపురం మన్యం జిల్లా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (క్షయ, లెప్రసీ, హెచ్.ఐ.వి) డా. సి.హెచ్.విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు పాత్ ఎన్.జి.ఓ సహాకారంతో 3 రోజుల వర్క్ షాప్ ను విజయనగరం ఎస్.వి.ఎన్ లేక్ ప్యాలిస్ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండవ రోజు విజయ కుమార్ పాల్గొని మాట్లాడుతూ విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో హెచ్.ఐ.వి, ఎయిడ్స్  పై గత ఐదు సంవత్సరముల నివేదికలను ఎ.ఆర్.టి., ఐ.సి.టి.సి., ఎస్.టి.ఐ., బ్లడ్ బ్యాంకులు, స్వచ్చంద సంస్థల నుండి తీసుకొని జిల్లాల్లో హెచ్.ఐ.వి, ఎయిడ్స్ ప్రభావము ప్రాంతాలు, సమూహాలు, వయాస్సుల వారిగా ఎవరికి  సోకుతుందో తెలుసుకోవడానికి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తద్వారా ఆయా విభాగాల్లో కార్యక్రమాలు చేపట్ట వచ్చని ఆయన తెలిపారు.  వర్క్ షాప్ లో హెచ్.ఐ.వి, ఎయిడ్స్ నియంత్రణకు డేటా అనాలసిస్ చేసి జన సమూహాలలో వ్యాధి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు,  కార్యక్రమాలు నిర్ణయించాలని చెప్పారు.  

  ఈ కార్యక్రమంలో సిడిసి సంస్థ ప్రతినిధి డా. ఉపమ శర్మ, పాత్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి హరీష్ పటేల్, ఏపీడిమాలజిస్ట్ డా. ఉజ్వల్, డబ్యు.హెచ్.ఓ. కన్సల్టెంట్ సుకుమార్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రతినిధులు, జిల్లాలో పనిచేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఎ.ఆర్.టి., ఎస్.టి.ఐ., ఐ.సి.టి.సిల ఉద్యోగులు పాల్గొన్నారు.