విజయనగరం జిల్లాలో ఉదయం పరీక్షకు 4879 గైర్హాజరు..


Ens Balu
2
Vizianagaram
2020-09-20 13:08:35

విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తెలిపారు. ఆదివారం గరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని సెయింట్ ఆన్స్, సెయింట్ జోసెఫ్ స్కూళ్లు, మయూరి కూడలి వద్ద ఉన్న ఆర్.కే. డిగ్రీ కళాశాల, బాలాజీ నగర్ లోని శ్రీనివాస జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల కేంద్రాలను స్వయంగా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు ప్రదేశాల్లో 88 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు.  ప్రతి అభ్యర్థిని కరోనా నిబంధనల మేరకు థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించామన్న కలెక్టర్ మొత్తం 20,918 మంది అభ్యర్థులకు గాను 16,039 మంది అభ్యర్ధులు మాత్రమే హాజరయ్యారని అన్నారు. కరోనా ప్రభావంతో చాలా మంది హాజరు కాలేకపోయరని వివరించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు.