ప్రభుత్వ విప్ గా కరణం ధర్మశ్రీ నియామకం


Ens Balu
6
Chodavaram
2022-07-19 16:37:34

చోడవరం ఎమ్మెల్యే,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్ గా నియమించారు. పార్టీ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తూ తన శక్తి వంచన లేకుండా అన్ని ప్రాంతాలు తిరుగుతూ వైఎస్సార్సీపీ అభివృద్దే  ధ్యేయంగా  పనిచేస్తున్న ధర్మశ్రీ ని గుర్తించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ విప్ గా  నియమించారు. అమరావతి నుండి గురువారం ఉదయం చోడవరం నియోజకవర్గానికి ఆయన  రానున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మశ్రీని ప్రభుత్వ విప్ గా నియమించడం పట్ల జిల్లా కేడర్ లో నూతన ఆనందం వ్యక్తం అవుతుంది. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేతోపాటు జిల్లా అధ్యక్షులుగా వున్న ధర్మశ్రీకి ప్రభుత్వ విప్ పదవితో జిల్లాలో పార్టీ మరింతగా అభివ్రుద్ధి చెందే అవకాశాలున్నాయి.