విజయనగరంలో హెరిటేజ్ వాక్
Ens Balu
8
Vizianagaram
2022-07-28 08:43:20
విజయనగరంలో శుక్రవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు హెరిటేజ్ వాక్ పేరుతో ఉదయం 7.00 గంటలకు ర్యాలీని నిర్వహించనున్నట్లు జిల్లా యుజవన అధికారి విక్రమాధిత్య తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీలో పాల్గొని స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను, స్ఫూర్తిని భావితరాలకు తెలియజేస్తారని వివరించారు. అధిక సంఖ్యలో యువత, వాలంటీర్లు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన గురువారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.