పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను కు సంబంధించిన ఫారం -16 ను ఖజానా కార్యాలయాలకు సమర్పించాలని జిల్లా ఖజానా అధికారి కవిటి మోహన రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి నెల జీతాలు ఫిబ్రవరి నెలలో నేరుగా జమ చేయడం జరిగిందని అన్నారు. ఉద్యోగుల 12 నెలల ఆదాయపు పన్ను వివరాలతో కూడిన ఫారం -16 ను డ్రాయింగ్ అండ్ డిస్బర్శింగ్ (డిడిఓ)లు తక్షణం తమ ఖజానాలలో సమర్పించాలని ఆయన కోరారు. ఉద్యోగులంతా తక్షణమే ఈ పనిని చేపట్టాలన్నారు.