ఓటరు కార్డుకు ఆధార్ సీడింగ్ కొరకు, మార్పులు చేర్పులు, తప్పులు సరిదిద్దుట, తొలగిం పులకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా సవరించిన ఫారమ్లు, ఆధార్ నంబర్ సేకరణ, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మరణాలు, డబుల్ ఎంట్రీ ఉన్న వాటిని ముందుగా నిర్థారణ చేసుకొని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆధార్ సీడింగ్ చేయాలని చెప్పారు. షెడ్యూలు ప్రకారం సవరణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇంటింటి సర్వే పై బిఎల్ఓలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమం, ఆధార్ సీడింగ్ కార్యక్రమం షెడ్యూలు ప్రకాకం ప్రారంభించి పూర్తిచేయటకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఒ. ఆనంద్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.