డిజిటలైజేషన్ సమర్ధవంతంగా చేపట్టాలి


Ens Balu
12
Rajamahendravaram
2022-07-28 10:34:57

రాజమహేంద్రవరం జిల్లాలో ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ విధానాన్ని అత్యంత సమర్థవంతంగా చెప్పడం ఎందుకు చేపట్టేందుకు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మాధవి లత తెలిపారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కే మీనా జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఓటరు జాబితా ను డిజిటలైజేషన్ చేసే విధానం అమలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం చెయ్యాల్సిన అవసరం దృష్ట్యా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో 80 శాతం మంది సచివాలయం సిబ్బంది ని బూత్ లెవెల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఇంటికి సంబందించిన వారి ఆధార్ వివరాలు సచివాలయం వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో తగినంత మానవ వనరులు ఉన్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఇచ్చే లక్ష్యాలను ఆచరణాత్మక విధానంలో చేపట్టి పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుందని తెలిపారు. 2022 సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించి మార్చి 2023 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసెందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరణ కోసం కొంత సమయం, తదుపరి సేకరించిన డేటా ను కంప్యూటరైజేషన్ కోసం మరికొంత సమయం పడుతుందని మాధవీలత తెలిపారు. సేకరించిన డేటా వివరాలు తప్పులు లేకుండా నమోదు చెయ్యడం కోసం మరింత సమయం పడుతుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకత్వంలో ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 800 నుంచి 1500 వందల వరకు ఓటర్లు ఉంటారు. వీరి డేటా సేకరణకు తగినంత సమయం తీసుకునే అవకాశం ఉందని ఎమ్ కె మీనా పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు మేరకు ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో వాలంటీర్ లని భాగస్వామ్యం చెయ్యడం జరగదని పేర్కొన్నారు.  

జిల్లా స్థాయి సమీక్ష: జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 1570 పోలింగ్ కేంద్రాలు ద్వారా క్షేత్ర స్థాయి లో బి ఎల్ ఓ లు ఇంటింటి సర్వే చేపట్టి ఓటరు జాబితా ను అత్యంత పారదర్శకంగా డీజీటలైజేషన్ చెప్పట్టాల్సి ఉందన్నారు. మొత్తం జిల్లాలో 15,44,735 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,57,735 మంది పురుషులు, 7,86,887 మంది స్త్రీలు, 119 మంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇప్పటి నుంచి ఓటరు జాబితా డీజీటలైజేషన్ పై క్షేత్ర స్థాయి లో రూఉత్ మ్యాప్ రూపొందించి, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పనులు ప్రారంభించా లని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు, ఆర్డీవో మల్లిబాబు, ఏ ఒ జీ. బీమారావు, తహశీల్దార్  ఏ. శ్రీనివాసరావు, , కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.