స్వాతంత్య్ర గొప్పదనాన్ని తెలియజేయాలి


Ens Balu
7
Tirupati
2022-07-28 11:03:32

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషం అని ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు.  గురువారం ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్   కాంపౌండ్ లో ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా  రాష్ట్ర ఆర్కైవ్స్ ప్రాంతీయ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన పురావస్తు ఎగ్జిబిషన్ కార్యక్రమమును తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజు కిషోర్, ఆర్కివిస్ట్  డైరెక్టర్ రంగరాజలతో కలసి రిజిస్ట్రార్   ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ...  స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంను జరుపుకోవడం  సంతోషమని ఈ సందర్భంగా  మన దేశ స్వాతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులు పోరాడిన విధానం , పోరాటానికి ముందు మన భారత  జీవన శైలి ఎలా ఉంది వంటి విషయాలపై  ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పురావస్తు పుస్తకాలను  ప్రదర్శించడం జరిగిందని తెలిపారు.  నేటితరం దేశానికి ఆదర్శంగా నిలవాలని అందుకు  అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా దేశ అభివృద్ధి కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధి లోకి రావాలని తెలిపారు. విద్యార్థులు కలలను కనడం కాదు వాటిని సాకారం చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని తెలిపారు.