శ్రీకాకుళం జిల్లాలో భూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ తెలిపారు. జగనన్న శాశ్వత భూ హక్కు కు సంబంధించిన భూ రీ సర్వే పై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భూ సర్వే పనులు జరుగున్నాయన్నారు. జిల్లాలో 348 మ్యాప్ లు ఉన్నాయన్నాయని, తీర ప్రాంతంలో కొబ్బరి, జీడి, మామిడి చెట్లు ఉన్నాయని అక్కడ సిగ్నల్స్ ఉండడం లేదని వివరించారు. సిగ్నల్స్ వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుందని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత విజయవాడ నుండి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సర్వే ఎడి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.