సత్వరమే భూసేకరణ పనులు పూర్తిచేయాలి


Ens Balu
8
Bhimavaram
2022-07-28 11:18:21

అర్హులైన పేదలందరికి ఇళ్లస్థలాల పట్టాలు మంజూరి చేసేందుకు అవసరమైన భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్  జె వి మురళి సంబంధింత అధికా రులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  అర్హులైన పేదలకు  90 రోజులలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినందుకు అవసరమైన భూమిని సేకరించాలని ఆయన సూచించారు.  జిల్లాలో అర్హులైన కౌలు రైతులకు అందరికీ సి సి ఆర్ సి  కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క  కౌలు రైతు కూడా సిసిఆర్ సి కార్డులు రాలేదని అనకూడదని అన్నారు.  మన జిల్లాలో కౌలు రైతులు చాలామంది ఉన్నారని వారందరికీ కచ్చితంగా సి సి ఆర్ సి కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. ఎం ఐ జి లేఔట్లకు స్థలాల సేకరణ   పట్టణ  ప్రాంతాలలో చేయాలని ఆయన సూచించారు. స్వామిత్వా రీ సర్వే  పై సమీక్ష చేశారు,  N H 165 అండ్  NH 216 నరసాపురం బైపాస్  కు అవసరమైన  భూసేకరణ పూర్తి చేయలన్నారు. ఏఎంసీయు,  బి ఎం సి యు లకు భూసేకరణ తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డిఓ దాసిరాజు  , తాసిల్దార్లు ,కలెక్టరేట్ ల్యాండ్ సూపర్డెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.