తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 1570 పోలింగ్ కేంద్రాలు ద్వారా క్షేత్ర స్థాయి లో బి ఎల్ ఓ లు ఇంటింటి సర్వే చేపట్టి ఓటరు జాబితా ను అత్యంత పారదర్శకంగా డీజీటలైజేషన్ చెపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ మాధవీలత తెలియజేశారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కే మీనా జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె జిల్లాలోని రెవిన్యూ అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ సంరద్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మొత్తం జిల్లాలో 15,44,735 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,57,735 మంది పురుషులు, 7,86,887 మంది స్త్రీలు, 119 మంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇప్పటి నుంచి ఓటరు జాబితా డీజీటలైజేషన్ పై క్షేత్ర స్థాయి లో రూఉత్ మ్యాప్ రూపొందించి, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పనులు ప్రారంభించా లని కలెక్టర్ మాధవీలత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు, ఆర్డీవో మల్లిబాబు, ఏ ఒ జీ. బీమారావు, తహశీల్దార్ ఏ. శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.