తూర్పుగోదావరి జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనుల విషయంలో స్టేజ్ కన్వర్షన్ లో, చెల్లింపుల విషయంలో మెరుగైన పురోగతి సాధించాడంలో అధికారులు సమన్వయం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి పిఆర్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కొన శశిధర్ లచే ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జీ పనుల్లో భాగంగా చేపడుతున్న అర్భికెలు, సచివాలయ, హెల్త్ క్లినిక్స్, బి ఎమ్ సి యూ భవన నిర్మాణ పనుల పై, అమృత్ సరోవర్ పథకం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో వివిధ శాఖలకు చెందిన భవన నిర్మాణ పనులను చేపట్టడం, వాటికి అనుగుణంగా నిధుల కేటాయింపు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అదే సమయంలో ఆయా పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులను అప్లోడ్ చేయాలి అని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను నిర్ణీత సమయం లో పూర్తి చేసేందుకు మెటీరియల్, కాంపోనెంట్ పథకం కి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కే. మాధవీలత అధికారులతో సమీక్ష చేస్తూ, జిల్లాలో జల జీవన్ మిషన్ కింద చేపట్టవలసిన టాప్ కనెక్షన్స్ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవారం 3,296 లక్ష్యం కోసం నిర్దేశించగా, కేవలం సుమారు 1400 మాత్రమే పూర్తి అవ్వడం పై వివరణ కోరారు. ప్రతీ వారం లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ భవనాలు 390 కి గాను 258 పూర్తి చేసి, మిగిలినవి పురోగతి లో ఉన్నాయన్నారు. అర్భికే లు 373 కి గాను 183 పూర్తి చేశారని, మిగిలినవి పూర్తి చేయాల్సి ఉనాయన్నరు. సచివాలయ అర్భికే భవనాలు, హెల్త్ క్లినిక్స్, బిఎమ్ సియూ/ ఏఎమ్ సియూ లు స్టేజ్ కన్వర్షన్ ప్రగతి చూపాలని, కోర్టు కేసులు ఉన్నవి తప్ప మిగిలిన అన్ని ప్రారంభం కావాలన్నారు. నియోజక వర్గం/ మండల వారీగా వారీగా ప్రాధాన్యత భవనాలు పై సమీక్ష చేస్తూ, వాటిని అన్నింటినీ గ్రౌండింగ్ చేసే దిశలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా స్థలం గుర్తింపు లేదా స్థల సమస్యలు పరిష్కారం చెయ్యాల్సి అవసరం ఉంటే సంబందించిన మండల అధికారులకు తక్షణం ప్రతిపాదనలు చెయ్యాలని పేర్కొన్నారు.
ఆగస్ట్ 15 నుంచి ప్రతి ఇంటికీ డాక్టర్ టై అప్ చేసే కార్యక్రమం చేపట్టనున్న దృష్ట్యా హెల్త్ సెంటర్ నిర్మాణం పనులు మరింత త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు. డ్వామా కి సంబందించిన ఉపాధి హామీ చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పి ఆర్ ఎస్ ఈ., ఎస్ బి వి ప్రసాద్, ఆర్ డబ్ ఎస్ ఎస్ ఈ డి బాల శంకర్, డ్వామా పీడీ పి. జగదాంబ, డి ఎ హెచ్.ఓ డా ఎస్టిజీ సత్య గోవింద్, తదితరులు పాల్గొన్నారు.