గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వి ఏ హెచ్ కార్యదర్శులు గా సేవలందిస్తున్న 128 మంది సర్వీసు క్రమబద్దీకరణ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో వి ఏ హెచ్ కార్యదర్శులు గా క్రమబద్దీకరణ అయిన ఉద్యోగులు డి ఏ హెచ్ ఓ సత్య గోవింద్ తో పాటు కలెక్టర్ ను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , సచివాలయం పరిధిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామ పశుసంవర్ధక సహాయకులుగా (కార్యదర్శులు) జిల్లాలో సేవలు అందిస్తున్న 128 మంది ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేసినట్లు తెలిపారు. మరో 50 మందికి అక్టోబర్ నాటికి సర్వీసు క్రమబద్దీకరణ పూర్తి కానున్న ట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ భద్రత కల్పించినందున ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పడానికి తనవద్దకు రావడం జరిగిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పశువుల సంరక్షణ కోసం మెరుగైన సూచనలు సలహాలు అందించే క్రమంలో నిబద్దతతో పని చేయాలని సూచించారు. పశుసంవర్ధక సహాయకుడు పోస్టుకు ప్రాథమిక అర్హత వెటర్నరీ పాలిటెక్నిక్ లేదా డైరీ సైన్స్‌తో ఇంటర్మీడియట్ వృత్తివిద్య లేదా పశుసంవర్ధక వృత్తి ఇంటర్మీడియట్‌తో 2 సంవత్సరాలు పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఏ హెచ్ ఓ ఎస్జీటి సత్య గోవింద్, పలువురు వి ఏ హెచ్ సహాయకులు పాల్గొన్నారు.