బాలికల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, దిశ చట్టం పై అవగాహన, బాలికలపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదురుకోవాలనే అంశాల పై విధ్యార్థునీలకు అవగాహన కల్పించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి యం.ఎస.శోభారాణి అన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయసమావేశమందిరంలో37 వసతి గృహాలు 11 ఫ్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాలు మరియు ఐదు కాలేజీ వసతి గృహాలు చదువుతున్న బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదురుకోవాలి, కౌమారదశలోని బాలికలు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలకు సంబందించి విద్యార్థినీలకు అవగాహన కల్పించామన్నారు.ఈ అవగాహనా కార్యక్రమానికి జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల్లో 8 వ తరగతి చదువుతున్న విధ్యార్థీనీలు 90 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. ప్రతి విద్యార్థినీ వ్యక్తలు వివరించిన బాలికలు ప్రభుత్వం కల్పించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈసందర్బంగా హాజరైన బాలికలకు నగదు పురస్కారం, బ్యాగ్ లు, అందజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధురి (గైనకాలజిస్ట్) దిశాపోలీస్ స్టేషన్ ఎస్ ఐ రేవతి, డీసీపీవో వెంకట్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్, చైల్డ్ లైన్ కోర్డినేటర్ బి శ్రీనివాసరావు, వరల్డ్ విజన్ ప్రోగ్రామర్ మేనేజర్ అరుణ్ ప్రకాష్,సాంఘికసంక్షేమ శాఖ,సిబ్బంది, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.