ఇలాగేనా స్పందన రికార్డులు నిర్వహించేది


Ens Balu
9
Visakhapatnam
2022-07-29 09:19:40

విశాఖలోని వార్డు సచివాలయంలో స్పందన రికార్డుల నిర్వహణ సరిగా లేవని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కార్యదర్శుల పై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె 6వ జోన్ 88 వ వార్డు పరిధిలోని నరవ, కోటనరవ లోని 399, 404 సచివాలయాల వార్డ్ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు తో, జోనల్ కమిషనర్ సింహాచలం తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కార్యదర్శుల హాజరు, మూమెంట్ రిజిస్టర్, డైరీలను పరిశీలించారు. ముఖ్యంగా స్పందన రికార్డులను పరిశీలించగా వాటి నిర్వహణ సరిగా లేనందున సచివాలయల కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ ను ప్రవేశపెట్టి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, అటువంటి సచివాలయ  వ్యవస్థను నిర్యయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో పనులపై మీ వద్దకు వస్తారని వారిని చిరునవ్వుతో స్వాగతించాలని సూచించారు. డయల్ యువర్ మేయర్, స్పందన లలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వార్డు సచివాలయాల స్థాయిలోని సమస్యలు ప్రధాన కార్యాలయం వరకు రాకూడదని, ప్రధాన సమస్యలైన త్రాగు నీరు విద్యుత్ దీపాలు పారిశుధ్యం మొదలైన మౌలిక వసతులు సచివాలయ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి, వాటిని 24 గంటల్లో పరిష్కరించాలని, మీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు పైఅధికారులకు సకాలంలో పంపించి అవి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో ఫిర్యాదులు అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని కార్యదర్శులను హెచ్చరించారు కార్యదర్శులు ఫీల్డ్ విజిట్ చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు.