విశాఖజిల్లాలో 16843 మంది గైర్హాజరు..


Ens Balu
2
Visakhapatnam
2020-09-20 17:29:20

విశాఖ జిల్లావ్యాప్తంగా జరిగిన గ్రామ,వార్డు సచివాలయ పోస్టుల నియామక పరీక్షలు తొలిరోజు విజయవంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నా రు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల నియామకం కొరకు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా  ముందుగా అభ్యర్థులకు కరోనాకు సంబంధించి థర్మల్ టెస్ట్ చేస్తున్న తీరుతెన్నులను ఏ.ఎన్.ఎం లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్  మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు పరీక్షకు 73246 మంది హాజరు కావాల్సి వుండగా, కేవలం 56403 మంది మాత్రమే హాజరయ్యారని చెప్పారు. 16843 మంది గైర్జాజరయ్యారని చెప్పారు.  జిల్లాలో ఈ నెల 20 నుండి 26 వరకు వారం రోజుల పాటు నిర్వహిస్తున్న గ్రామ,వార్డు సచివాలయ పరీక్షలకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్ధులకు స్క్రీనింగ్ టెస్ట్ మొదలు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని, కరోన లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదుల ఏర్పాటుచేశామని చెప్పారు.  దీనివలన జిల్లాలో ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తలేదని, అభ్యర్థులు ఏ.పి.పి.ఎస్.సి సూచించే నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాశారని కలెక్టర్ తెలిపిన కలెక్టర్ కరోనా లక్షణాలు, పాజిటివ్ ఉన్నవారికి 19 ఐసోలేషన్ గదువు ఏర్పాటు చేసినట్టు వివరించారు. రాబోయే ఆరు రోజులు కూడా ఇదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ పరీక్షలను విజయవంతం చేస్తామని కలెక్టర్ వివరించారు.