కేసులు పరిష్కాకారానికి రాజీ మార్గమే ఉత్తమమని రెండవ అదనపు జిల్లాజడ్జి సిహెచ్. రాజ గోపాల రావు తెలిపారు. ఆగష్టు 13 తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా శనివారం జిల్లా కోర్ట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆగష్టు 13 తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని జాతీయ లోక్ అదాలత్ లో వారి యొక్క కేసులు రాజీ చేసుకోవాలని తెలిపారు. బ్యాంకులు , ఏలక్ట్రికల్, ఎక్సైజ్ , కుటుంబ సంబందిత కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించు కోవచ్చునన్నారు. చిన్నచిన్న కేసులకు కూడా కోర్టులచుట్టూ తిరిగి డబ్బు, కాలం వృధా చేసుకోవద్దని సూచించారు. కేసులు రాజీ పర్చుటకు పోలీసులు, లాయర్లు , పబ్లిక్ ప్రాసిక్యూటర్ , అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహకరించాలన్నారు. ముఖ్యంగా చిన్న కారణాలకే తగువుపడి, రాజీపడాలనుకునే భార్య,భర్తలను, కుటుంబాలను ప్రోత్సహించి రాజీ చేయాలని తెలిపారు. పోలీసు స్టేషన్ వారీగా పెండింగ్ కేసులు వివరాలు సమీక్షించారు. వాటిలో సాద్యమైనన్ని కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరించే విదంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి జి. యజ్ఞనారాయణ , అడిషనల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సౌజన్య , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసరావు , పోలీసు అధికారులు , న్యాయవాదులు , కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు.