మానవ మనుగడకు మొక్కలు ఎంతో కీలకమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగర పరిధిలోని 44వ డివిజన్ పరిధిలోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ శాంతి సుధ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం,వైసీపీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి,కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటంలో మొక్కలు ఎంతో దోహదపడుతాయన్నారు.సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాడాన్ని ఉద్యమంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.చెట్లు నాటడమే కాకుండా వాటిని రక్షించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.ప్లాస్టిక్ నిర్ములన కూడా పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇషాక్ ,బాబా ఫక్రుద్దీన్,నాయకులు మధు,ఖాజా పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేష్ ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.