శ్రీ కనకమహాలక్ష్మి అమ్మకు గంట్ల పూజలు


Ens Balu
5
Visakhapatnam
2022-08-05 08:09:49

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం(వరలక్ష్మీ వ్రతం) సందర్భంగా విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతంని పురస్కరించుకుని తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది  భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించారు.. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరలక్ష్మీ వ్రతం, శ్రావణ శుక్రవారం సందర్భంగా  శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కనక మహాలక్ష్మి ఆలయంలో పంచామృత అభిషేక సేవలో పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరిని దర్శించుకునీ  ప్రత్యేక పూజలు చేసి.. తరువాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో శిరీష ఆధ్వర్యంలో భక్తులకు విశేష ఏర్పాట్లు చేశారు.


వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని పాతనగరం లో కొలువై ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని బంగారు చీరతో అందంగా అలంకరించారు.. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.. బంగారు చీరలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరవశం చెందారు.