విజయనగరం జిల్లాలోని వైద్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేయాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. దీనికి జిల్లా పరిషత్ నుంచి తమవంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మెరకముడిదాం మండలం గర్భాం పిహెచ్‌సికి కంప్యూటర్, ప్రింటర్ కమ్ స్కానర్, యుపిఎస్‌లను, జిల్లా పరిషత్‌లో శుక్రవారం అందజేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, గర్భాం పిహెచ్‌సి వైద్యులు, సిబ్బంది వీటిని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి సిఇఓ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్, డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్, మెరకముడిదాం మండల నాయకులు తాడ్డి వేణు, కోట్ల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.