కోవిడ్ లో 10వేల మంది కళాశీలకు జువారీ సిమెంట్స్ సేవ
Ens Balu
2
విశాఖపట్నం
2020-09-20 20:29:46
కోవిడ్ 19 నేపధ్యంలో తమ సంస్థ సామాజిక బాధ్యతగా 10వేల మందికి నిత్యావసర వస్తువులు అందచేయడం జరుగుతుందని జువారి సిమెంట్స్ జనరల్ మేనేజర్ తిలక్ బాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో అన్నం పేరిట ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆదివారం అక్కయ్యపాలెం విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేనన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1000 మంది కళాసీలు, వ్యాన్, ఆటో డైవర్లు ఇతర సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కె తిలక్ బాబు మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా జువారి సిమెంట్ తన వంతు సామాజిక బాధ్యతగా సేవలను అందచేస్తోం దన్నారు. ఇందుకోసం ప్రతి సిమెంట్ బస్తా పైన ఒక రూపాయి పక్కన పెట్టి ఆ సోమ్ముతో ఆయా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవల కొనసాగిస్తున్నామని అయితే విశాఖలో మరింత మందికి నిత్యావసర వస్తువులను దశలవారీగా అందచేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. గౌరవ అతిధిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఇప్పటికే సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ కార్యవర్గం సుమారు 6 లక్షల రూపాయిలతో దశలవారీగా నిత్యావసర వస్తువులను అందచేశారన్నారు. భవిష్యత్‌లో వారి సేవలు మరింతగా విస్తరించాలని ఆయన అకాంక్షించారు. కోవిడ్ నేపధ్యంలో జర్నలిస్టులు అందించిన సేవలు అందరి మన్ననలు పొందుతున్నాయిని అన్నారు. ప్రధాని మోడి తో పాటు ప్రతి ఒక్కరు మీడియా సేవలకు జేజేలు పలుకుతున్నారని ప్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి జర్నలిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని శ్రీనుబాబు కోరారు. ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన విశాఖ జిల్లా స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుతరావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కరోనా నేపధ్యంలో ఇప్పటికే అనేక మందికి నిత్యావసర వస్తువుల అందచేశామన్నారు. ఇప్పుడు జువారి సిమెంట్ సంస్థ సౌజన్యంతో తొలివిడతగా వెయ్యిమందికి దశలవారీగా మరికొంతమందికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ త్రినాధరావు, కార్యదర్శి ఉమామహేశ్వరావు కార్యవర్గసభ్యులు పాల్గోన్నారు.