వైఎస్సార్ బడుగు వికాసంతో ప్రోత్సాహం


Ens Balu
9
Rajamahendravaram
2022-08-16 14:59:59

వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించేందుకు సంప్రదాయ మద్యం తయారీ గ్రామాల్లో ఎంపికైన అభ్యర్థులకు రుణ సదుపాయాలు కల్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి  కలెక్టర్ ఛాంబర్ లో  అక్రమ మద్యం తయారీలో ఉన్న గ్రామస్తులకు  మద్దతు కార్యక్రమం నిర్వహించడం పరిశ్రమల, సిడ్బి, బ్యాంకర్ల, ఎంపిడివో లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, గతంలో అక్రమ మద్యం తయారీ చేసే రంగంలో ఉన్న వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో గౌరవమైన జీవనాన్ని సాగించే ప్రక్రియలో మద్దతుగా నిలవాల్సి ఉందన్నారు. అందులో భాగంగా సిడ్బి (చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా జిల్లా పరిశ్రమలు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆయా మండలాలు పరిధిలోని బ్యాంకులతో మాట్లాడి మెప్పించడం ద్వారా ఆదాయ వనరుగా యూనిట్స్ స్థాపన కార్యరూపం సాధించి ఒక రోల్ మోడల్ గా నిలవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆ దిశలో  రాజానగరం మండలం శ్రీరామ్ పురం లో 7 యూనిట్స్, కొవ్వూరు మండలం మద్దూరి లంకలో 8 యూనిట్స్, చాగల్లు మండలం చిక్కాల , చిక్కాలపాలెం లో 14 యూనిట్స్ గ్రౌండింగ్ చేసే దిశలో తీసుకున్న చొరవను కలెక్టర్ అభినందించారు.  ఇటువంటి కార్యక్రమాలను మరింత మంది మెరుగైన జీవనోపాధి దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మరింత మందికి స్ఫూర్తి పొందే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇది ఆరంభం మాత్రమే నని ఆమె తెలిపారు.

పి ఎం ఈ జీ పి/వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద ఏ పి ఖాదీ & గ్రామీణ పరిశ్రమల బోర్డ్ ద్వారా 24 యూనిట్స్ , జిల్లా పరిశ్రమల ద్వారా 5 యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎస్ బి ఐ  దివాన్ చెరువు బ్రాంచ్ ద్వారా 7 యూనిట్స్ రూ.22 లక్షలతో,  చిక్కాల బ్రాంచ్ ద్వారా 13 యూనిట్స్ రూ.66 లక్షల తో, నిడదవోలు బ్రాంచ్ ద్వారా ఒక యూనిట్ రూ.25 లక్షలతో, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడపల్లి బ్రాంచ్ ద్వారా 8 యూనిట్స్ రూ.22 లక్షల మూల ధనంతో బ్యాంకర్లు ముందుకు వచ్చారని తెలిపారు. ఇందులో లబ్దిదారుని వాట 5 శాతం, బ్యాంక్ రుణ సౌకర్యం 95 శాతం కల్పించడం జరిగిందని వివరించారు . ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా లబ్దిదారులు 35 శాతం మేర ప్రభుత్వ సబ్సిడీ గా పొందవచ్చు అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి కె. వేంకటేశ్వరరావు, మెప్డా - సిడ్బి ప్రాజెక్ట్ ఆఫీసర్ టి. శ్రీనివాస రావు, ఎల్ డి ఎం కె. దిలీప్ కుమార్, బ్యాంకు మేనేజర్ లు, చాగల్లు, కొవ్వూరు, రాజానగరం ఎం పి డి వో లు పాల్గొన్నారు.