విశాఖలో రెండ్రోజులు మెగా ఫోటో ప్రదర్శన


Ens Balu
9
Visakhapatnam
2022-08-16 15:13:26

విశాఖలో ఈ నెల 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా 18,19 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు ఆసిల్ ఆశీల్ మెట్ట వద్ద ఉన్న వేమన మందిరంలో మెగా ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వాల్తేర్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ కార్యదర్శి ఎం.వి.శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.  మంగళవారం పెద్ద వాల్తేర్ లోని అసంగానంద ఆశ్రమంలో  నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించే ఈ ప్రదర్శనలో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పత్రికా సంపాదకులు వి.వి.రమణ మూర్తి పాల్గొంటారన్నారు. దివంగత సీనియర్ ఫోటో జర్నలిస్ట్ డాక్టర్ పల్లా రాజారావు(వాసు) పేరిట జీవిత సాఫల్య పురస్కారాన్ని విఖ్యాత సీనియర్ ఫోటో జర్నలిస్టు కోదండ రామయ్యకు అందజేస్తామన్నారు. ఈ ప్రదర్శనలో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ లతోపాటు 30 మంది ఇతర ఫోటోగ్రాఫర్లు తీసిన ఆర్ట్ ఫోటోలు, ఫోటో జర్నలిజంపై 800 ఫోటోలు సందర్శకులకు కనువిందుచేస్తాయి అన్నారు. చివరి రోజు సాయంత్రం జరిగే ముగింపు ఈ కార్యక్రమంలో వారికి ప్రోత్సాహక పత్రాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో  అధ్యక్షుడు పి ఎన్ సేత్, గౌరవ అధ్యక్షులు ఈ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వి వి రామరాజు, సహాయ కార్యదర్శి  ఎం వి నర్సింగరావు, కోశాధికారి జగపతిరాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.