శత శాతం పనులు గ్రౌండ్ కావాలి


Ens Balu
6
Parvathipuram
2022-08-18 11:29:19

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు నేడు క్రింద మంజూరైన భవన నిర్మాణ పనులు శత శాతం గ్రౌండింగ్ కావాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఆదేశించారు. విద్యాశాఖ మంజూరు చేసిన మన బడి నాడు నేడు పనుల పురోగతిపై స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్  సురేష్ కుమార్, నాడు నేడు మౌలిక సదుపాయాల సలహాదారు మురళీధర్ తో కలసి  గురువారం  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రభుత్వ  జూనియర్ కళాశాలలు, అంగన్వాడి, పాఠశాల భవనాలు పనులు వేగవంతం చేయాలని సూచించారు. అందుకు అవసరమైన పాలనా అనుమతులు, రివాల్వింగ్ ఫండ్ జమ చేయాలని అన్నారు. లక్ష్యాల పూర్తికి పనుల వేగం పెంచాలన్నారు.  నూతన విద్యా విధానం లో మ్యాపింగ్ పూర్తి అయిన స్కూల్స్ లో ఉపాధ్యాయులు, విద్యార్థులను  చేర్చాలని అన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లో విస్తారంగా వర్షాలు కురవడం, సిమెంట్ , ఇసుక సకాలంలో చేరకపోవడం వలన పనులలో కొంత మేర జాప్యం ఏర్పడిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ అధికారి పి.బ్రహ్మాజీ రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ప్రభాకర రావు, తదితరులు, పాల్గొన్నారు.