ఎంపీఎఫ్సీ గోడౌన్ల భూసేకరణ త్వరగా చేయాలి


Ens Balu
6
Bhimavaram
2022-08-18 11:46:51

పశ్చిమగోదావరి జిల్లాలో ఎం.పి.ఎఫ్.సి ( మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ) గొడౌన్లు భూసేకరణ మరింత వేగవంతం చేయాలని డైరీ డెవలప్మెంట్   ఎండి  ఏ.బాబు జిల్లా కలెక్టర్ లకు సూచించారు.  గురువారం అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో  ఎం.పి.ఎఫ్.సి, బిఎం సియు (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ),ఏఎంసియు (ఆటో మేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్), లకు భూసేకరణ, వాటి నిర్మాణం పై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ జిల్లాలలో నిర్మాణ దశలో ఉన్న మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు మరింత వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూసమస్యలు ఉన్నచోట వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు.  భూమి కేటాయించిన వాటిలో కొన్ని స్థలాలు గొదాముల నిర్మాణానికి అనుకూలంగా లేవని ఇంజనీరింగ్ అధికారులు నివేదిక అందించారని అట్టి వాటికి కూడా భూములను గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటికే భూములు కేటాయించిన వాటికి పనులు త్వరితగతిన చేపట్టాలని, ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

  వీడియో కాన్ఫరెన్స్ లో భీమవరం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 113  బి ఎం సి యు లకు గాను  110 బి ఎం సి యు లకు భూమి కేటాయించడం జరిగిందని ,  వీటి నిర్మాణాలు జరుగుతున్నాయని , జిల్లా లో 395 ఏ ఎం సి యు లకు గాను 255 ఏ ఎం సీ యు లకు భూమి కేటాయించడం జరిగిందని, మిగిలిన వాటికి కూడా త్వరగా భూసేకరణ పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్  లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి కె.క్రిష్ణవేణి , జిల్లా సహకార శాఖ,  మార్కెటింగ్ శాఖ ,   ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.