క్యాపిటివ్ సీడ్ పెంపకంతో చక్కటి ఉపాది..


Ens Balu
9
Vizianagaram
2022-08-18 13:50:08

ఇరిగేషన్ చెరువులను  మత్స్య సహకార సంఘాలకు లీజు కి ఇస్తామని,  ఆ చెరువులలో మత్సకారులు  చేప పిల్లల సాగు చేయడం ద్వారా జీవనోపాదిని పొందవచ్చునని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి తెలియజేశారు. యూత్ హాస్టల్ మీటింగ్ హాల్ లో  గురువారం ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ (APIIATP) క్రింద వ్యవసాయ పరివర్తన సమావేశం మత్స్యకారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఉప సంచాలకులు నిర్మలకుమారి మాట్లాడుతూ,  చెరువులలో ఫింగర్ లింగ్స్ సైజు చేప పిల్లలు వేయడం ద్వారా అధిక మొత్తం లో ఖర్చై మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని.. ఈ ఇబ్బందులను అధికమించడానికి ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు,  వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ , వరల్డ్ బ్యాంక్ ఆర్ధిక సహకారంతో పెద్ద చెరువులలో క్యాప్టివ్ సీడ్ నర్సరిలను నిర్మించి వాటిలో తక్కువ ఖర్చుతో చిరు చేప పిల్లలను వేసుకొని (స్పాన్) వాటిని ఫింగర్ లింగ్ సైజు చేప పిల్లలు గా వచ్చేవరకూ సాగు చేసుకోవచ్చునని తెలియజేశారు. తక్కువ ఖర్చు తో ఎక్కువ చేప పిల్లలను క్యాప్టివ్ సీడ్ నర్సరీల ద్వారా అభివృద్ధి పొందవచ్చునని సూచించారు. అదేవిధంగా చేపలు, రొయ్యలు మొదలుకొని  అమ్మకాల వరకు తాజా స్థితిలో పరిశుబ్రమైన వాతావరనంలో ఏ విధంగా అమ్మకాల జరపాలి,  ఎలా చేపలను నిల్వ చేసుకోవాలనే  విధానం పై మత్స్యకారులకు శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా ప్రజలందరికి అందుబాటులో తాజా చేపలు , రోయ్య్యలు అందించేందుకు ప్రతి గ్రామ సచివాలయం పరిధి లో ఫిష్ ఆంధ్రా షాప్ లను ఏర్పాటు చేసుకోవాలని మత్స్యకారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 60 శాతం సబ్సిడీ, ఇతరులకు 40 శాతం సబ్సిడీ ఈ పథకం ద్వారా అందించున్నట్టు డిడి పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వి వినియోగించుకోవాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలా కుమారి  తెలియజేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం ( PMMSY ) గురించి కూడా ఈ సమావేశంలో మత్స్యకారులకు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో IRPWA – ప్రకాష్, ఎఫ్డీఓ యు.చాందిని,  సహాయ తనిఖిదారులు సి.హెచ్. సంతోష్ కుమార్, జి. వెంకటేష్, సి.హెచ్.వి.వి. ప్రసాద్ రావు, గ్రామ మత్స్య సహాయకులు, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.