జివిఎంసి పరిధిలో రోడ్లు, కూడళ్లను అభివృద్ధికి సంబంధించి రవాణా ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలపై జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ గురువారం తన ఛాంబర్లో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, బిల్డర్లు, ఇంజనీర్లతో కలసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ, జివిఎంసి పరిధిలో గల రోడ్లు, కూడళ్లను అభివృద్ధి పరచుటకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా ఆధారిత అభివృద్ధి ( ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్- TOD) కార్యక్రమం సంబంధించి నగరంలో గల బిల్డర్లు, ఎల్టిపీలు, ఆర్కిటెక్ట్లు, నేరేడ్కో క్రెడాయ్ ప్రతినిధులకు అవగాహన కల్పించుటకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ టీఓడీ పాలసీ ఉపయోగాలకు సంబంధించి వాటి
రూపకల్పన, నమూనా పటములు, విధి విధానములను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సిటీ ప్లానర్ వివరించిన అంశములకు సంబంధించి, బిల్డర్లు, ఆర్కిటెక్ట్లు నరేడ్ ట్కో , క్రెడాయ్ ప్రతినిధులు అవగాహన పరుచుకొని ఈ నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిపి సురేష్, సిటీ ప్లానర్, ఇంజనీర్లు, ఆర్కిటెట్లు, తదితరులు పాల్గొన్నారు.