స్పందనలో ‘డయల్ యువర్ కమిషనర్


Ens Balu
4
Nellore
2022-08-20 07:35:09

ప్రతీ సోమవారం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ‘డయల్ యువర్ కమిషనర్’ ను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పై సమాచారం ఇవ్వాలనే ప్రజలు, పరిష్కారం నిమిత్తం కార్యాలయానికి రాలేని వారు సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 0861 – 2355678 నంబరుకు ఫోన్ చేసి సూచించిన గడువులోపు సంప్రదించాలని కోరారు. కార్యాలయంలో నిర్వహించే స్పందన వేదికలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తామని కమిషనర్ తెలిపారు. కావున అవసరమైన వారు ‘ డయల్ యువర్ కమిషనర్’ ద్వారా సేవలు పొందాలని కమిషనర్ ఆకాంక్షించారు.