గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదని ఏపి రాష్ర్ట భాషా సాంస్కృతిక మండలి ఛైర్మన్ వంగపండు ఉష అన్నారు. స్నేహాంజలి ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశాఖలోని పౌర గ్రంధాలయంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన వంగపండు ఉష మాట్లాడుతూ, రైతన్నలు ఆరుగాలం పండించిన పంటలు కోసేటప్పుడు, బిడ్డకు తల్లి అన్నం తినిపించేటప్పుడు ఆలపించే గీతాలే జానపదాలన్నారు. తన తండ్రి వంగపండు ప్రసాదరావు ఎక్కడ ప్రజలకు మేలు చేకూరుతుందంటే అక్కడే జానపదంతో వారికి అండంగా నిలేచేవారన్నారు. ఆ రోజుల్లో కనీసం వాయిద్య పరికరాలు కూడా లేవని కేవలం అగ్గిపెట్టితోనే సంగీతం సమకూర్చుకుని ఆలపించేవారన్నారు. అయితే ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం కళాకారులకు అన్ని విదాల అండగా నిలుస్తుందన్నారు. గత ఏడాది అవార్డులు అందించి ఎంతో మందిలో స్పూర్తి నింపిందన్నారు. ఇక రాష్ర్ట శిష్టకరణం వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కంటి మహంతి అనూషాపట్నాయక్ మాట్లాడుతూ జానపద దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా స్నేహాంజలి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య, అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, పూర్వపు ఏడీసీపీ మహ్మద్ ఖాన్, పలు కళాసంస్థల గౌరవ అధ్యక్షులు కొనతాల రాజు, పణిస్వామి తదితరులంతా పాల్గొని కళాకారుల సేవలను కొనియాడారు.
ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తమ సేవలను గుర్తించి సత్కరించడం తమలో మరింత బాధ్యత పెంచేలా చేసిందని సన్మానగ్రహీతలు నాగభూషణం, నరసింహమూర్తిలు అన్నారు. భవిష్యత్తులో కూడా తాము కళాకారులకు అండగా ఉంటామన్నారు. స్నేహాంజలి ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వి.ఎన్.మూర్తి సారధ్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఇందులో భాగంగానే వంగపండు ఉష తన పాటలతో అలరించగా ప్రముఖ జానపద కళాకారుడు అసిరయ్య తన ఆట, పాటతో కేరింతలు కొట్టించాడు. అంతకు ముందు వ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఒక్కరూ జానపద కళలను కాపాడుకునే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సేవా పరులుగా పేరుగాంచిన మాతారికార్డింగ్ సెంటర్ అధినేతలు పల్లి నాగభూషణం, బిన్నాల నరసింహమూర్తులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి భీశెట్టి వెంకటేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యవహరించారు.