ఆయన తమ్ముడివా..ఈయన దత్త పుత్రుడివా


Ens Balu
9
Visakhapatnam
2022-08-22 16:08:45

ఒక సిద్ధాంతం.. ఆలోచన లేని.. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా  ముఖ్యమంత్రి జగన్మోహ న్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా  వుందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడా? చంద్రబాబు దత్తపుత్రుడా? అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పాలని  అమర్నాథ్ డిమాండ్ చేశారు.సోమవారం ఆయన స్థానిక సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ, మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు బట్టి  చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు మధ్య డీల్ కుదిరినట్టు అర్థమవుతోందని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడే ఆ పార్టీ చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్ల, చంద్రబాబు చేత పెట్టిన పార్టీ అని అప్పుడే చెప్పామని అమర్ నాథ్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ నుంచి విముక్తి చెయ్యమని పవన్ కళ్యాణ్ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019లో జనసేన టీడీపీ నుంచి  రాష్ట్ర ప్రజలు తమను తాము కాపాడుతున్నారని అమర్ ఎద్దేవా చేశారు.  ఆ రోజు ఫలితాలు చూసి తమకు రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్  భావించి ఉంటారని అన్నారు.  చంద్రబాబుతో తాను కలిసి లేనని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చెప్పుకోలేక పోతున్నారని అమర్ నాథ్ అన్నారు.  పవన్ కళ్యాణ్ మాటలు బట్టి ఆయన చంద్రబాబు ప్రొడక్షన్లో పనిచేస్తున్నారని స్పష్టం అవుతోందని అమర్ నాథ్ అన్నారు.

 ఈ రెండు పార్టీలు వస్తే సంక్షేమ పథకాల నుంచి ప్రజలను దూరం చేస్తారన్నది నిజమని అన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా క్షేమం కోసం ఖర్చు చేయలేదని అన్నారు.అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ ఎలా కలిసుండాలని భావిస్తున్నారని అమర్ నాథ్ ప్రశ్నించారు.  జగన్ మోహన్ రెడ్డి లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన చెప్పార.  ఇవి పవన్ కళ్యాణ్ కి  కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కళ్ళుండీ చూడలేక పోతున్నారని మంత్రి అన్నారు. పరిశ్రమలు రావాలంటే కప్పం కట్టాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను అమర్ నాథ్ తీవ్రంగా ఖండించారు. ఏ పారిశ్రామికవేత్త అయినా ఫలానా నాయకుడికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ డబ్బులు ఇచ్చినట్లు చెప్పగలరా?  అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎవరినీ బెదిరించ వలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడి పవన్ కళ్యాణ్ ఆయన చెంత చేరని అమర్ నాథ్ అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉండగా చిరంజీవి అంటే తమకు ఎంతో అభిమానమని ఆయన పుట్టిన రోజు నాడు ఆయన కించపరిచే విధంగా పవన్ మాట్లాడడం తనకు బాధాకరంగా ఉందని అమర్ నాథ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు  కలత చెంది పవన్ ను కొణెదల పవన్ కళ్యాణ్ అని  పిలవాలా?  లేక నారా నాదెండ్ల పవన్ కళ్యాణ్ అని పిలవాలా? అర్థం కావట్లేదని అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడిన వచ్చే ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి నే  తిరిగి ముఖ్యమంత్రి గా చేయాలని రాష్ట్ర ప్రజలు  నిర్ణయిoచు కున్నారు అని అమర్ నాథ్ స్పష్టం  చేశారు.