అంతర్వేదిలో ప్రారంభమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు


Ens Balu
1
Antervedi Pallipalem
2020-09-21 09:19:04

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలను ఈరోజు నుంచి పునరుద్ధరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలో, దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేసిన అధిరాలు ఈ ఉదయం నుంచి తిరిగి దర్శనాలు పునరుద్దరించారు. యాధావిధి గానే స్వామివారికి మేలుకొలుపు, వేకువ జామున పూజలు అనంతరం దర్శనాలకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్‌ భద్రాజీ మాట్లాడు తూ, స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో రావాలని సూచించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, వృద్ధులకు ఆలయంలో ప్రవేశం లేదని చెప్పారు. స్వామివారి దర్శనాలు ప్రారంభం కావడంతో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణం సందడిగా మారింది. వేకువ జామునుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు...