గ్రామ స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం సంభందిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, గృహ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన చెప్పారు. గ్రామ స్థాయి భవనాల నిర్మాణానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. వై.ఎస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష (రీ సర్వే) పనులు వేగవంతం చేయాలని, స్పందన వినతులు పరిష్కారం పక్కాగా జరగాలని ఆయన పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, జిల్లా ప్రణాళిక అధికారి వీర్రాజు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె.రాజ కుమార్, ఇంఛార్జి జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, హౌసింగ్ డిఇ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.